రాజస్థాన్ లో కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం – ఇద్దరు పైలెట్ లు దుర్మ‌ర‌ణం
రాజస్థాన్, 9 జూలై (హి.స.) రాజస్థాన్‌లో ఎయిర్‌ ఫోర్స్ విమానం నేడు కుప్పకూలింది. చురులోని రతన్‌గఢ్ ప్రాంతంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ లు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద ధాట
ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్


రాజస్థాన్, 9 జూలై (హి.స.)

రాజస్థాన్‌లో ఎయిర్‌ ఫోర్స్ విమానం నేడు కుప్పకూలింది. చురులోని రతన్‌గఢ్ ప్రాంతంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ లు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద ధాటికి పొలంలో విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎయిర్‌ఫోర్స్ అధికారులు సహయక చర్యలు చేపట్టారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande