ముంబయి, 9 జూలై (హి.స.)దేశీయ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నడుమ మన సూచీలు ప్రతికూలంగా కదలాడుతున్నాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 190 పాయింట్లు నష్టంతో 83,521 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు తగ్గి 25,474 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 20 పైసలు పెరిగి 85.90 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ సూచీలో హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, సిప్లా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ