న్యూఢిల్లీ, 9 జూలై (హి.స.)
ఐసీసీ తాజాగా పురుషుల క్రికెట్ టెస్ట్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బ్రూక్ మొదటి స్థానానికి వచ్చేసాడు. మొన్నటి వరకు ఇంగ్లాండ్ ఆటగాడు రూట్ మొదటి స్థానంలో ఉండగా.. ఇప్పుడు అతను రెండో స్థానానికి వచ్చాడు.
ఇక భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత టీమిండియా యంగ్ కెప్టెన్ గిల్ ఏకంగా 15 స్థానాలు పైకి వచ్చి ఆరవ స్థానానికి చేరుకున్నాడు. ఇక రిషబ్ పంత్ ఒక స్థానం దిగజారి ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. టాప్ 10 లో ఈ ముగ్గురు టీమిండియా ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత.. టాప్ 20 వరకు ఏ ఒక్క టీం ఇండియా ఆటగాడు లేకపోవడం విశేషం.
ఇక ఈ ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ ఆటగాడు కెన్ మామ మూడో స్థానం దక్కించుకున్నాడు. ఐదో స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవెన్ స్మిత్ ఉన్నాడు. టెంబ బవుమా ఏడో స్థానం దక్కించుకున్నాడు. 8వ స్థానంలో మెండిస్ ఉండగా పదో స్థానంలో స్మిత్ ఉన్నాడు. స్మిత్ కూడా 16 స్థానాలు ఎగబాకి పదో స్థానానికి చేరుకున్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..