ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి.. పాట్నాలో క్రాష్ ల్యాండింగ్
పాట్నా, (బీహార్) 9 జూలై (హి.స.) పాట్నా నుండి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానాన్ని ఓ పక్షి ఢీకొంది. పాట్నా విమానాశ్రయం నుంచి బుధవారం ఉదయం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి పాట్నా ఎయిర్
ఇండిగో విమానం


పాట్నా, (బీహార్) 9 జూలై (హి.స.)

పాట్నా నుండి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానాన్ని ఓ పక్షి ఢీకొంది. పాట్నా విమానాశ్రయం నుంచి బుధవారం ఉదయం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి పాట్నా ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో మొత్తం 169మంది ప్రయాణీకులున్నారు. విమానం సేఫ్ గా ల్యాండింగ్ కావడంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణీకులను వేరే విమానంలో ఢిల్లీకి పంపే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande