దిల్లీ::, 9 జూలై (హి.స.) ప్రపంచంలో ఉగ్రవాద నిధులను పర్యవేక్షించే సంస్థ FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) తాజా నివేదికలో సంచలన విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఉగ్రవాద సంస్థలు ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆన్‌లైన్ చెల్లింపు సేవలను ఉపయోగిస్తున్నాయని తెలిపింది. భారతదేశంలోని రెండు ప్రధాన కేసులైన 2019 పుల్వామా దాడి, 2022 గోరఖ్‌నాథ్ ఆలయ దాడిని ఎఫ్‌ఏటీఎఫ్ ప్రస్తావించింది. ఈ సంఘటనలలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ముఖ్యమైన పాత్ర పోషించాయని పేర్కొంది. పుల్వామా దాడిలో ఐఈడీ (IED) తయారు చేయడానికి.. అల్యూమినియం పౌడర్‌ను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశారని వెల్లడించింది. గోరఖ్‌నాథ్ ఆలయ దాడిలో, నిందితుడు పేపాల్ ద్వారా సుమారు రూ.6.7 లక్షలు విదేశాలకు పంపినట్లు తెలిపింది. అందుకుగానే వీపీఎన్ సేవను ఉపయోగించి తన స్థానాన్ని దాచిపెట్టాడని సంచలన విషయాన్ని చెప్పింది. ‘
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ