పులివెందులలో 550 మందిపై బైండోవర్ కేసులు.. భారీగా పోలీసుల బందోబస్తు.
కడప 10 ఆగస్టు (హి.స.) జిల్లాలోని పులవెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటల తర్వాత తెర పడనుంది. దీంతో పులివెందులలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఉండగా అన్ని కేంద్రాలు సమస్యాత్మకమే.. అలాగే, ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలు ఉండ
పులివెందులలో 550 మందిపై బైండోవర్ కేసులు.. భారీగా పోలీసుల బందోబస్తు.


కడప 10 ఆగస్టు (హి.స.) జిల్లాలోని పులవెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటల తర్వాత తెర పడనుంది. దీంతో పులివెందులలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఉండగా అన్ని కేంద్రాలు సమస్యాత్మకమే.. అలాగే, ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 4 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పులివెందులలో 550 మంది పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా.. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నిక కోసం 650 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande