జలాలాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.)దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ రోజు సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భారీ భూకంపం కారణంగా 9 మంది మృతి చెందగా, 25 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్‌తో పాటు ఉత్తర భారత దేశంలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. భవనాలు కంపించటంతో జనం భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టారు.
జలాలాబాద్‌కు ఈశాన్యంగా 27 కి.మీ (16.77 మైళ్ళు) దూరంలో నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని 8 కి.మీ (4.97 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించిందని USGS నివేదించింది. USGS నమూనాలు ఈ భూకంపం వల్ల వందలాది మంది మరణించవచ్చని అంచనా వేస్తున్నాయి.
భూకంపం తర్వాత ప్రజలు ఇంకా భయాందోళనలోనే ఉన్నారు. ఆదివారం రాత్రి 12.47 గంటలకు భూకంపం సంభవించింది. మొదట 6.0 తీవ్రతతో, ఆ తర్వాత 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హార్ ప్రజారోగ్య విభాగం ప్రతినిధి నకిబుల్లా రహీమి తెలిపారు. భూకంపం కారణంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఈ భూకంపం వల్ల చాలా ఇళ్లు కూలిపోయినట్లు తెలుస్తోంది. దీంతో భారీ నష్టం సంభవించినట్లు నివేదికలు వెలువడుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి