చైనాలో రూ.7 కోట్ల కారులో ప్రధాని మోదీ.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
షాంఘై, 2 సెప్టెంబర్ (హి.స.)తాజాగా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు కోసం చైనాలో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడ ఓ అత్యంత ఖరీదైన కారులో ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన ప్రయాణించిన ''మేడ్ ఇన్ చైనా'' కారు పేరు హాంగ్చీ-ఎల్‌5
చైనాలో రూ.7 కోట్ల కారులో ప్రధాని మోదీ.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?


షాంఘై, 2 సెప్టెంబర్ (హి.స.)తాజాగా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు కోసం చైనాలో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడ ఓ అత్యంత ఖరీదైన కారులో ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన ప్రయాణించిన 'మేడ్ ఇన్ చైనా' కారు పేరు హాంగ్చీ-ఎల్‌5. ఇది చైనాలోనే అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కారుగా ప్రసిద్ధి చెందింది. దీని ధర మన భారత కరెన్సీలో సుమారు రూ.7 కోట్లు ఉండటం విశేషం.

ఈ కారు పేరు వెనుక కూడా ఓ ఆసక్తికరమైన కథ ఉంది. మాండరిన్ భాషలో 'హాంగ్చీ' అంటే 'ఎర్రజెండా' అని అర్థం. ఒకప్పుడు ఈ కార్లను కేవలం చైనా కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుల కోసం ప్రత్యేకంగా రూపొందించేవారు. కాలక్రమేణా ఇది దేశంలోనే ఓ లగ్జరీ సింబల్‌గా మారిపోయింది. ప్రధాని మోదీ ఈ కారులో ప్రయాణించడంతో దీనిపై మరోసారి అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.

ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే, ఇవి వాహన ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కేవలం 8.5 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సత్తా దీని సొంతం. గంటకు గరిష్ఠంగా 210 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఇందులో క్రూయిజ్ మోడ్, ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతికతను వాడారు. అంతేకాకుండా, సురక్షితమైన పార్కింగ్ కోసం సెన్సర్లు, 360-డిగ్రీ కెమెరాలు కూడా ఉన్నాయి. లోపల అత్యంత విశాలమైన, విలాసవంతమైన సీట్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande