కొరియా.సినిమాకు. ప్రపంచ వ్యాప్తంగా.గుర్తింపు
పొన్నూరు, 12 సెప్టెంబర్ (హి.స.) , : కొరియా సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని కౌన్సిల్‌ జనరల్‌ ఆఫ్‌ ద రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా చాంగ్‌-న్యూన్‌ కిమ్‌ పేర్కొన్నారు. గురువారం చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ‘కొరియ
కొరియా.సినిమాకు. ప్రపంచ వ్యాప్తంగా.గుర్తింపు


పొన్నూరు, 12 సెప్టెంబర్ (హి.స.)

, : కొరియా సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని కౌన్సిల్‌ జనరల్‌ ఆఫ్‌ ద రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా చాంగ్‌-న్యూన్‌ కిమ్‌ పేర్కొన్నారు. గురువారం చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ‘కొరియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొరియన్‌ సినిమాలను భారతదేశ ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారని చెప్పారు. కొరియా సంస్కృతి సినిమాలు విద్యార్థులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని పేర్కొన్నారు. కొరియన్‌ భాషా అభ్యాసం కొనసాగిస్తూ ఉన్నత స్థాయి ప్రావీణ్యం సాధించడం ద్వారా ఇరు దేశాల యువతకు భవిష్యత్తు అవకాశాలను విస్తరించవచ్చని తెలిపారు. రెండు దేశాల భద్రతా రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రజలు మధ్య పరస్పర సంబంధాలను విస్తరించడం అత్యవసరమని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande