ట్రంప్‌ సుంకాలతో ఉద్యోగాలు పోతున్నాయ్‌ - శశిథరూర్‌
న్యూఢిల్లీ,12,సెప్టెంబర్ (హి.స.)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) విధించిన సుంకాలు భారత్‌పై ప్రభావం చూపుతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ (Shashi Tharoor) పేర్కొన్నారు. ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని అన్నారు.
Sasi tharoor


న్యూఢిల్లీ,12,సెప్టెంబర్ (హి.స.)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) విధించిన సుంకాలు భారత్‌పై ప్రభావం చూపుతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ (Shashi Tharoor) పేర్కొన్నారు. ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని అన్నారు. ట్రంప్‌ వ్యవహారశైలి, స్వభావం పూర్తి గందరగోళంగా ఉందంటూ మండిపడ్డారు. సింగపూర్‌లో క్రెడాయ్‌ (CREDAI) ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. సంప్రదాయ దౌత్య ప్రమాణాలను అమెరికా అధ్యక్షుడు గౌరవించడం లేదన్నారు.

‘ట్రంప్‌ కన్నా ముందు 44 లేదా 45 మంది అధ్యక్షులుగా పనిచేసినప్పటికీ.. వైట్‌హౌస్‌ నుంచి ఈ రకమైన ప్రవర్తన ఎన్నడూ చూడలేదు. ఏ రకంగా చూసినా ఆయన (Donald Trump) అసాధారణ అధ్యక్షుడు. సంప్రదాయ దౌత్య ప్రమాణాలను ఆయన గౌరవించడం లేదు. నోబెల్‌ శాంతి బహుమతికి అర్హుడనని ఏ దేశాధినేత అయినా చెప్పడం విన్నామా? ప్రపంచంలోని అన్ని దేశాలు మా వద్దకే వచ్చి మోకరిల్లుతాయని చెప్పడం విన్నామా? భారత్‌, రష్యాలవి డెడ్‌ ఎకానమీలు అని చెప్పడం ఎప్పుడైనా విన్నామా? ఓ దేశాధ్యక్షుడి నుంచి వినిపించకూడని భాష ఇది. అందుకే ఆయనో అసాధారణ వ్యకి. ట్రంప్‌ ప్రవర్తన ద్వారా మా పనితీరును నిర్ణయించవద్దు’’ అని దాదాపు 1000 మందికిపైగా రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు, కన్సల్టెంట్‌లు పాల్గొన్న ఈ సమావేశంలో శశిథరూర్‌ విజ్ఞప్తి చేశారు.

2.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande