అమరావతి, 17 సెప్టెంబర్ (హి.స.)
: విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 11: 15 నిమిషాలకు బీచ్ రోడ్డులోని కోస్టల్ బ్యాటరీ హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్కే బీచ్ రోడ్డులో ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కి చేరుకోనున్నారు. కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఉమన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో ప్రధాన మంత్రి మోడీ వర్చువల్ గా ప్రారంభించే స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు హోటల్ రాడిసన్ బ్లూలో జరిగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5: 20 గంటలకు కోస్టల్ బ్యాటరీ హెలిపాడ్ కు చేరుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరి వస్తాడు. ఇక, ఇవాళ విశాఖలో సీఎం పర్యటనతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. బందోబస్తు, ఇతర ఏర్పాట్లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రజలు వెళ్లాలని సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు వచ్చే సమయంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తామని పోలీసులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ