అమరావతి, 17 సెప్టెంబర్ (హి.స.)
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్‌ను ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
అంబేడ్కర్, ఆయన బంధువుల ఇళ్లలో 15 చోట్ల మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఓ బంధువు ఇంట్లో రూ.2.18 కోట్లు గుర్తించారు. అంబేడ్కర్‌కు హైదరాబాద్‌లో ఆరు ప్లాట్లు.. గచ్చిబౌలిలో ఐదంతస్తుల భవనం ఉన్నట్లు గుర్తించారు. మరో ఖరీదైన భవనం.. వెయ్యి గజాల స్థలం, సూర్యాపేటలో పది ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అంబేడ్కర్ ఇంట్లో బంగారం, బ్యాంకులో రూ.78 లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఈక్రమంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన్ను మంగళవారం అరెస్టు చేశారు. బుధవారం ఉదయం జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ