తెలంగాణ, నాగర్ కర్నూల్.24 సెప్టెంబర్ (హి.స.)
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో 167 నంబర్ హైవేపై కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కళాశాలకు సొంత భవనంతో పాటు లెక్చరర్స్ కొరత తీర్చాలని, కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండు గంటలకు పైగా కొనసాగిన రాస్తారోకోతో కొల్లాపూర్-నాగర్ కర్నూల్ మధ్య జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. స్థానిక పోలీసులు విద్యార్థులు, ఏబీవీపీ నాయకులతో మాట్లాడిన ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు