హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.)
కృష్ణా జలాల్లో వాటా 299 టీఎంసీలుగా ఒప్పుకుంది కాంగ్రెస్ పార్టీనేనని.. ఇప్పుడు అదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడటం హంతకుడే సంతాప సభ పెట్టినట్లుగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కృష్ణ జలాలపై తెలంగాణ ప్రభుత్వానిది పూటకో మాట.. గడియకో లెక్క అంటూ ఫైర్ అయ్యారు. చారిత్రక తప్పిదం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని.. తెలంగాణ సాగు నీటి రంగం చరిత్రలో ద్రోహులు వారేనని దుయ్యబట్టారు. కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేశామంటూ మంగళవారం స్టేట్మెంట్ ఇచ్చారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా బేసిన్ మీద 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్వోసీ ఇచ్చి.. ఏ ప్రాజెక్టులైన కట్టుకోండని చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చాడని చెప్పారని చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు