రూ. 19 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
తెలంగాణ, నాగర్ కర్నూల్. 24 సెప్టెంబర్ (హి.స) అచ్చంపేట నియోజకవర్గంను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా పని చేస్తూనే ఉంటానని ఈ క్రమంలోనే నియోజకవర్గంలో పలు మండలాలలో అభివృద్ధి పనులకు రూ. 19 కోట్ల నిధులతో పనులకు శ్రీకారం చుడుతున్నామని
అచ్చంపేట ఎమ్మెల్యే


తెలంగాణ, నాగర్ కర్నూల్. 24 సెప్టెంబర్ (హి.స)

అచ్చంపేట నియోజకవర్గంను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా పని చేస్తూనే ఉంటానని ఈ క్రమంలోనే నియోజకవర్గంలో పలు మండలాలలో అభివృద్ధి పనులకు రూ. 19 కోట్ల నిధులతో పనులకు శ్రీకారం చుడుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ఈ క్రమంలోనే అచ్చంపేట నియోజకవర్గంలో విద్యాభివృద్ధి వివిధ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు నిధులు మంజూరు అయ్యాయన్నారు.

ఈ క్రమంలోనే లింగాల మండలం కేంద్రంలో నూతనంగా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ గురుకుల భవనానికి మూడు కోట్ల నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అలాగే మండలంలోని ప్రైమరీ స్కూల్ కు రూ. 30 లక్షలు అమ్రాబాద్ మండలం జూనియర్ కాలేజీకి రూ. 20 లక్షలు డిగ్రీ కళాశాలకు కళాశాల కాంపౌండ్ నిర్మాణానికి రూ. 20 లక్షలు మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామంలోని గవర్నమెంట్ హై స్కూల్ రూ.50 లక్షలు అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్లో ఉన్న జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు రూ. 60 లక్షలు అచ్చంపేట పట్టణంలోని స్టడీ హాల్ లైబ్రరీ కోసం రూ.60 లక్షలు, లింగాల మండలంలోని అవులికుంట ప్రైమరీ స్కూల్కు రూ.5 లక్షలు మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ స్కూల్కు రూ. 5 లక్షలు కిచెన్ టాయిలెట్స్ కోసంమరో ఐదు లక్షల కస్తూర్భా గాంధీ పాఠశాల మరమ్మతుల కోసం రూ. ఐదు లక్షలు మంజూరు అందుకు సంబంధించిన పనులు ప్రారంభిస్తామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande