1258 మంది సింగరేణి బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ.. ఉత్తర్వులు జారీ
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 24 సెప్టెంబర్ (హి.స.) సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరి భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనులు లేదా సర్ఫేస్ లో పనిచేస్తూ 190/240 మస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ అసిస్టెంట్ కేటగిరి - 1 గా క్రమబద్ధీకరించేందుకు వీలుగా
సింగరేణి ప్రమోషన్స్


తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 24 సెప్టెంబర్ (హి.స.)

సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరి భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనులు లేదా సర్ఫేస్ లో పనిచేస్తూ 190/240 మస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ అసిస్టెంట్ కేటగిరి - 1 గా క్రమబద్ధీకరించేందుకు వీలుగా సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు విడుదల చేసింది. 2024 డిసెంబర్ 31 లేదా అంతకు ముందు తమ సంవత్సరకాలం సర్వీసు చేసిన వారిని భూగర్భగనుల్లో అయితే 190 మస్టర్లు, ఓపెన్ కాస్ట్ గనుల్లో లేదా సర్ఫేస్ లో అయితే 240 మస్టర్లు పూర్తి చేసి ఉన్న బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1 క్రమబద్ధీకరించడానికి యాజమాన్యం అంగీకరించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.

ఈ క్రమబద్ధీకరణ విషయమై సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్, డైరెక్టర్ పర్సనల్ గౌతమ్ పొట్రులతో గుర్తింపు కార్మిక సంఘం అయిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జరిపిన చర్చల అనంతరం యాజమాన్యం ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు పంపించాల్సిందిగా జనరల్ మేనేజర్ (పర్సనల్), ఐ ఆర్ & పి ఎం బుధవారం అన్ని ఏరియాలకు ఒక సర్క్యులర్ జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande