తెలంగాణ, వనపర్తి. 24 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన విజ్ఞప్తి
మేరకు పెబ్బేరు పట్టణ అభివృద్ధికి 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ.. పెబ్బేరు పట్టణంలోని సీసీ రోడ్లు, డ్రైనేజీ, పార్కుల నిర్మాణం కోసం నిధులు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. పెబ్బేరు పట్టణ అభివృద్ధి కోసం నిధుల మంజూరీకి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ, జిల్లా మంత్రులు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లురవిలకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు