
న్యూఢిల్లీ, 15 జనవరి (హి.స.)
భారత ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీలో ప్రారంభమైన 28వ కామన్వెల్త్ దేశాల స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సును (CSPCC) గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం తన అపారమైన భిన్నత్వాన్ని ప్రజాస్వామ్యానికి ఒక శక్తిగా మార్చుకుందని కొనియాడారు. ప్రజాస్వామ్య సంస్థలు, ప్రక్రియలు ఒక దేశ అభివృద్ధికి అవసరమైన స్థిరత్వాన్ని, వేగాన్ని, భారీ స్థాయిని ఎలా అందిస్తాయో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని మోడీ స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్యం ఒక మహావృక్షం వంటిదని, దీనికి వేల ఏళ్ల నాటి లోతైన మూలాలు అండగా ఉన్నాయని ఆయన అభివర్ణించారు.
. కుల, మత, భాషా భేదాలకు అతీతంగా ప్రజలందరూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావడం వల్లే దేశం నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..