కారుణ్య మరణం’ కేసులో తీర్పు రిజర్వ్‌
ఢిల్లీ,15, జనవరి (హి.స.): దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణం అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. తన కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ హరీశ్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్
Supreme Court HD


ఢిల్లీ,15, జనవరి (హి.స.): దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణం అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. తన కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ హరీశ్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. అతడు కోలుకునే అవకాశం లేదని వైద్యులు ధ్రువీకరించారని, మానవీయ కోణంలో మర్యాదపూర్వక చావును (Harish Rana Euthanasia Case) ప్రసాదించాలని వారు కోర్టును వేడుకున్నారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం (Supreme Court) తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఒకింత ఆవేదన వ్యక్తంచేసింది. ‘‘ఈ కేసులో కారుణ్య మరణం అనే పదాన్ని మేం ఉపయోగించలేం. మేం నిత్యం ఎన్నో కేసులు విచారిస్తాం. కానీ, ఇది చాలా సున్నితమైన అంశం. మేమూ మనుషులమే. ఎవరు బతికి ఉండాలో? ఎవరు చనిపోవాలో నిర్ణయించేందుకు మనం ఎవరం?’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande