
అమరావతి, 17 జనవరి (హి.స.)
అమరావతి: ఈనెల 20న కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ కోరారు. జీవో నంబర్ 15తో అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమం ప్రభుత్వ అధికారిక కార్యక్రమమైందని తెలిపారు. వైకాపా హయాంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసిన వెల్లం మార్పచిల్లి.. వైశ్యులకు, కన్యకాపరమేశ్వరి ఆలయాలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కన్యకాపరమేశ్వరి ఆలయాల్లో 20న అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పొట్టిశ్రీరాములు 58 రోజుల దీక్షహ్కుఅభిద్కరణ ప్రతీకగా మార్చి 16న అమరావతిలో 58 అడుగుల విగ్రహావిష్కరణ చేయనున్నట్లు డూండి రాకేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తోందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండను .. వాసవీ పెనుగొండగా పేరుమార్పు చేయడం ఆనందదాయకమన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ