
హైదరాబాద్, 17 జనవరి (హి.స.)సొంత గ్రామాల్లో సంక్రాంతి(Sankranti Festival) పండుగను ఘనంగా జరుపుకున్న ప్రజలు తిరిగి నగరబాట పట్టారు. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రధాన నగరాల బస్ స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. వివిధ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇక.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలే వసూళ్లు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేందుకే ప్రజలు మొగ్గుచూపుతున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు