.పోలీస్ స్టేషన్ ఎదుట ఓ.వ్యక్తి. నీ.దారుణంగా హతమార్చారు
తనకల్లు, 05 జనవరి (హి.స.) : పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున తనకల్లు పీఎస్‌ ఎదుట ఈశ్వరప్ప అనే వ్యక్తిని అన్నదమ్ములు హరి, చెన్నప్ప హత్య చేశారు. పోలీసులు తెలిపిన వ
.పోలీస్ స్టేషన్ ఎదుట ఓ.వ్యక్తి. నీ.దారుణంగా హతమార్చారు


తనకల్లు, 05 జనవరి (హి.స.)

: పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున తనకల్లు పీఎస్‌ ఎదుట ఈశ్వరప్ప అనే వ్యక్తిని అన్నదమ్ములు హరి, చెన్నప్ప హత్య చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాగినేపల్లికి చెందిన ఈశ్వరప్ప.. ఈనెల 1న హరి భార్యను తీసుకెళ్లాడు. హరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. గాలింపు చేపట్టారు. వారిరువురూ గూడూరులో ఉన్నట్లు తెలుసుకుని ఆదివారం అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున పీఎస్‌ వద్దకు వారిద్దరినీ తీసుకొచ్చారు. కారు దిగి స్టేషన్‌లోకి వెళ్తుండగా.. ఈశ్వరప్పను హరి, చెన్నప్ప కొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటనతో హరి భార్య అక్కడి నుంచి పరారైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande