ఏపీలో.టూరిజం.పెద్ద ఎత్తున అభివృద్ధి
అమరావతి, , ఏపీలో టూరిజంను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం పర్యాటక శాఖ ఎన్నో విప్లవాత్మక ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఒకప్పుడు సినీ హీరోలు, వీఐపీలకు మాత్రమే ఉండే కారవాన్‌లను ప్రభుత్వం ఏపీ పర్యా
ఏపీలో.టూరిజం.పెద్ద ఎత్తున అభివృద్ధి


అమరావతి, , ఏపీలో టూరిజంను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం పర్యాటక శాఖ ఎన్నో విప్లవాత్మక ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఒకప్పుడు సినీ హీరోలు, వీఐపీలకు మాత్రమే ఉండే కారవాన్‌లను ప్రభుత్వం ఏపీ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

ఈ కారవాన్‌ టూరిజం ద్వారా పర్యాటక ప్రేమికులకు ప్రకృతి అందాలు, సుప్రసిద్ధమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు ఎన్నో పేరుగాంచిన క్షేత్రాలను వీక్షించే సౌకర్యం కల్పిస్తోంది. సంక్రాంతి సెలవులు నేపథ్యంలో 4 ఎంపిక చేసిన మార్గాల్లో ఈ టూరిజం ప్యాకేజీలను తాజాగా ఏపీ టీడీసీ ప్రకటించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande