అమరావతిలో.రేపటి..నుంచి. రెండో.దశ ల్యాండ్.పోలింగ్
అమరావతి, 06 జనవరి (హి.స.) ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్‌ రాజధాని అమరావతిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా పనులు జరుగుతున్నాయి.. ఇక, రాజధాని ప్రాంతం అమరావతిలో రేపటి (జనవరి 7) నుంచి రె
అమరావతిలో.రేపటి..నుంచి. రెండో.దశ ల్యాండ్.పోలింగ్


అమరావతి, 06 జనవరి (హి.స.)

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్‌ రాజధాని అమరావతిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా పనులు జరుగుతున్నాయి.. ఇక, రాజధాని ప్రాంతం అమరావతిలో రేపటి (జనవరి 7) నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ దశలో గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలోని 7 గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) భూ సమీకరణకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండో దశలో మొత్తం 20,494 ఎకరాల భూమిని సమీకరించనున్న ప్రభుత్వం, రాజధానిలో కీలక మౌలిక వసతుల నిర్మాణానికి ఈ భూసేకరణ చేపడుతోంది. ఇందులో: పట్టా భూమి: 16,562 ఎకరాలు కాగా.. అసైన్డ్ భూమి: 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి: 3,828 ఎకరాలుగా ఉండనుంది..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande