
అమరావతి , 13 అక్టోబర్ (హి.స.)బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగురాష్ట్రాల్లో గడిచిన వారంలో రోజుల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇవి ఈ వర్షాల కాలంలో వానలు లేక అల్లాడుతున్న రైతులకు కాస్త ఊరనిచ్చాయి. కానీ ఇకపై మళ్లీ వర్షాలు కరువై భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవాకశం ఉందని.. వెదర్మ్యాన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వర్షాలు కరిసే ఛాన్స్ ఉందని తెలిపింది. దేశంలోకి ఈశాణ్య రుతువనాల రాకకు వాతావరణం అనుకూలంగా ఉందని వీటి ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.ఈ నెల 15 నుంచి 18లోపు తెలంగాణలోకి ఈశాణ్య రుతుపవనాలు ప్రవేశించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇక ఈశాన్య రుతుపవణాల ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్ర, ధక్షిణ కోస్తాంద్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మరికొన్ని జిల్లాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని అంచానా వేసింది. అలాగే తీర ప్రాంతాల్లో వర్షాల సమయంలో గంటలకు 30-40 కిలీ మీటర్ల వేగంతో ఈదురుగాలుఉ కూడా వీయొచ్చని తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV