శ్రీశైలం జలాశయంకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
శ్రీశైలం జలాశయంకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది.
/srisailam-dam-gets-place-in-world-book-of-records-full-details-


శ్రీశైలం, 13 అక్టోబర్ (హి.స.)

శ్రీశైలం జలాశయం అద్భుతమైన ఇంజనీరింగ్ ఫీచర్స్, అసాధారణమైన దృఢత్వానికి గాను ‘‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’’లో చోటు దక్కించుకుంది.శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కడం తెలుగు రాష్ట్రాలకే గర్వకారణమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందిస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు శ్రీశైలం అని తెలిపారు.

దశాబ్దాలుగా లక్షలాది ప్రజల తాగునీటి, సాగునీటి అవసరాలను శ్రీశైలం జలాశయం తీరుస్తోందని చెప్పారు. భారీ వరదలను తట్టుకున్న శ్రీశైలం డ్యామ్ నిర్మాణ పటిష్ఠతకు అంతర్జాతీయ గుర్తింపు దక్కడం ఆనందదాయకమన్నారు.

సముద్ర మట్టానికి దాదాపు 980 అడుగుల ఎత్తులో నిర్మితమైన శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ ఎత్తు, దానికి అమర్చిన భారీ క్రెస్ట్ గేట్ల పరిమాణం, విశిష్టమైన నిర్మాణ శైలి, నాణ్యతా ప్రమాణాలు ఈ గుర్తింపు సాధించడంలో కీలక పాత్ర పోషించాయి. అలాగే, గతంలో రికార్డు స్థాయిలో భారీగా వచ్చిన వరద ప్రవాహాలను కూడా సమర్థవంతంగా తట్టుకుని నిలబడిన ఈ ప్రాజెక్టు భద్రతా విశేషాలను సేకరించిన సంస్థ బృందం దీనిని ప్రపంచ రికార్డుగా పరిగణించింది. ఈ విశిష్ట అవార్డు ప్రకటనలో భాగంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు అందజేసిన ప్రశంసాపత్రాన్ని శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం డ్యాం నిర్మాణ విశిష్టతకు, నాటి ఇంజనీర్ల నైపుణ్యానికి దక్కిన అంతర్జాతీయ గౌరవమిదని కొనియాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande