తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు లేకపోవడంతో భక్తులు నేరుగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభిస్తోంది.
తిరుమల

నతిరుమల క్షేత్రం నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగుతూ ఉంటుంది. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు స్వామివారి సేవలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చే భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటారు.

భక్తుల రద్దీ సాధారణంగా ఉన్న సమయంలో దర్శనానికి వచ్చే వారికి తమ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో ఎలాంటి టైమ్ స్లాట్ టోకెన్లు లేని భక్తులకు ఉచిత సర్వదర్శనం (SSD) పూర్తి కావడానికి సుమారు 8 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు ఏర్పాట్లు చేసింది టీటీడీ.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

 rajesh pande