
నిజామాబాద్, 15 అక్టోబర్ (హి.స.) నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం అనువైన పరిస్థితులను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ఏర్పాటు చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు.
పబ్లిక్ స్కూల్ కోసం అందుబాటులో ఉన్న స్థలం, ఇతర వసతులను పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఒకే చోట కొనసాగుతున్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలను కలుపుకుని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ. 6 కోట్ల నిధులు సైతం మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు.
అన్ని వసతులు, అధునాతన సౌకర్యాలతో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఒకటవ తరగతి నుండి 12 తరగతి వరకు నాణ్యమైన విద్యా బోధన జరిగేలా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..