తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణలో అక్టోబర్ 15 నుంచి 18వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Rain


హైదరాబాద్ , 15 అక్టోబర్ (హి.స.)తెలంగాణలో అక్టోబర్ 15 నుంచి 18వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొడి వాతావరణం, వర్షపాతం లోటు కారణంగా పంటలు, నీటి వనరులపై ప్రభావం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నది.

తాజా వాతావరణ అంచనా ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande