జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
భారత భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్ నుంచి ఇండియాలోకి అక్రమంగా చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి.
3 Army officers survive helicopter crash in Leh on Wednesday


ఢిల్లీ , 17 అక్టోబర్ (హి.స.)భారత భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్ నుంచి ఇండియాలోకి అక్రమంగా చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి.

భారత్-పాక్ సరిహద్దు అయిన లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ) వద్ద, కెరాన్ సెక్టార్లోని, జగ్మండ్ ఏరియాలో శనివారం వేకువఝామున ముగ్గురు, నలుగురు వ్యక్తులు రహస్యంగా ఇండియావైపు రావడాన్ని భారత భద్రతా దళాలు గుర్తించాయి.

ఈ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా.. ఎల్వోసీ నుంచి సరిహద్దు దాటి ఇండియాలోకి వచ్చేందుకు తీవ్రవాదులు ప్రయత్నించారు. ఈ క్రమంలో భారత భద్రతా బలగాలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. దీంతో ఉగ్రవాదులు కూడా మన సిబ్బందిపై కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన భారత ఆర్మీ ఎదురు కాల్పులు జరిపింది. వారిని గాలిస్తూ కాల్పులు జరపడంతో ఇద్దరు తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తీవ్రవాదులు అక్రమ చొరబాటుకు ప్రయత్నించారని, ఎన్కౌంటర్లో ఇద్దరు మరణించారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande