ఈశాన్య ఋతుపవనాల ప్రభావం.. చెన్నైలో వర్ష బీభత్సం
ఈశాన్య ఋతుపవనాల ప్రభావం.. చెన్నైలో వర్ష బీభత్సం
Rains


హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని చెన్నై తో పాటు సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా తిరువళ్లూరు పరిసరాల్లో రికార్డు స్థాయిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో సాగు చేసిన పంటపొలాలు నీటమునిగి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. చెన్నై నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులపై మోకాళ్ళ లోతు వరద నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ యంత్రాంగం రంగంలోకి దిగి మోటార్ల సహాయంతో రోడ్లపై నిలిచిన వరద నీటిని ఎప్పటికప్పుడు తొలగించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande