ఏపీ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉంది.....సీఎం చంద్రబాబు
ఏపీ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, మంచి ట్రాక్ రికార్డు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్స్లో బుధవారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
Chandrababu


అమరావతి , 21 అక్టోబర్ (హి.స.)ఏపీ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, మంచి ట్రాక్ రికార్డు ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.

మంగళగిరిలోని ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్స్లో బుధవారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ... శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలజడి, అశాంతి, అభద్రత ఉన్న ప్రాంతాలకు పెట్టుబడులు రావని, నేను ఎప్పుడు అధికారంలో ఉన్నా శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని తేల్చి చెప్పారు. దేశ రక్షణకు భంగం కలిగే చర్యలను ఏపీ పోలీసు వ్యవస్థ అడ్డుకుందని అన్నారు. భద్రతపై నమ్మకం ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని చెప్పారు.

తీవ్రవాదం, రౌడీయిజాన్ని అణచివేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. నేరాలకు పాల్పడే వారికి రాజకీయ అండ ఉండకూడదని స్పష్టం చేశారు. మహిళల భద్రత సమాజ నాగరికతకు కొలమానమని పేర్కొన్నారు. ఒక వ్యక్తి చెడు అలవాట్లు అతడి కుటుంబంతో పాటు సమాజంపైనా ప్రభావం చూపుతాయని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande