
అన్నమయ్య జిల్లా , 21 అక్టోబర్ (హి.స.)అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుంలో ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ల సమయంలో వైఎస్సార్సీపీ , టీడీపీ శ్రేణులు పరస్పర దాడులకు దిగాయి. టీడీపీ నేత పవన్కుమార్రెడ్డి కారుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.
ఈ ఘటనతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
కారుకు మంటలు ఎలా అంటుకున్నాయి? ఈ ఘటన వెనుక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాహనానికి నిప్పు పెట్టడం వెనుక వ్యక్తిగత కక్షలు ఉన్నాయా, రాజకీయ విభేదాలు కారణమా అనే అంశాలు కూడా విచారణ చేస్తున్నారు.
ఘటన జరిగిన ప్రాంతంలో అందుబాటులో ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్