
అమరావతి , 21 అక్టోబర్ (హి.స.)విశాఖపట్నం నుంచి కిరండూల్ మార్గంలో ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే కీలక మార్పులను ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 28 వరకు విశాఖపట్నం–కిరండూల్ ఎక్స్ప్రెస్, కిరండూల్–విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. అదేవిధంగా మరో నాలుగు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసి, వాటి ప్రయాణాన్ని సాధారణ గమ్యస్థానాల బదులు కోరాపుట్ వరకు పరిమితం చేసినట్లు పేర్కొనది.
ఈ మార్గం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నాన్ని ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉద్యోగాలు, విద్య, వైద్యం, వ్యాపార అవసరాల కోసం ఈ మార్గంలో ప్రయాణించే వారు రైళ్లపై ఆధారపడుతుంటారు. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి కిరండూల్ వెళ్లే ప్రయాణికులు, మార్గమధ్య స్టేషన్లలో ఎక్కే వారు, తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్న వారు రద్దు వివరాలను ముందుగానే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 18515 నంబరు విశాఖపట్నం–కిరండూల్ ఎక్స్ప్రెస్, 18516 నంబరు కిరండూల్–విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రెండు దిశల్లోనూ నిర్ణీత వ్యవధిలో నడవవు. అలాగే 18447, 18448 నంబర్ల భువనేశ్వర్–జగదల్పూర్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 58501, 58502 నంబర్ల విశాఖపట్నం–కిరండూల్ ప్యాసింజర్ రైళ్లలోనూ మార్పులు ఉన్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్