
హైదరాబాద్, 23 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముంబైకి పయనం కావాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది.
దీంతో అప్రమత్తమైన సిబ్బంది, క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నించారు. ఏటీసీ (ATC) అధికారుల సహకారంతో పైలట్ ఆ విమానాన్ని సురక్షితంగా తిరిగి శంషాబాద్‌లోనే కిందికి దించారు.
ఈ విమానంలో మొత్తం 109 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే పైలట్ చూపిన తెగువ, సమయస్ఫూర్తి వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ప్రయాణికులను మరో మార్గంలో ముంబై పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi