
హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.)
ఎస్ఐఆర్ పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే వర్గాల ఓటర్ల పేర్లను పెద్దఎత్తున తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఏఐసీసీ పరిశీలకుడు రవీంద్ర దాస్ ఆరోపించారు.
ఇందుకోసం భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను వారు తమకు అనుకూలంగా ఉపయోగించు కుంటున్నారని అన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో
రవీంద్ర దాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పోరాడుతున్నారని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత ఎన్నికల్లో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రత్యర్థులపై దాడులు చేయించారని ఆయనn ఆరోపించారు. ప్రస్తుతం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు భారత ఎన్నికల సంఘాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించు కుంటున్నారని విమర్శించారు. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ఓట్ చోరీ ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..