
న్యూఢిల్లీ:25 అక్టోబర్ (హి.స.)
గుజరాత్ సరిహద్దుల్లోని కచ్ జిల్లా సర్ క్రీక్ ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) అప్రమత్తంగా వ్యవహరించింది. భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన నలుగురు పాకిస్థాన్ జాలర్లను బిఎస్‌ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద ఉన్న ఒక పడవను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
శనివారం సాయంత్రం సమయంలో గస్తీ నిర్వహిస్తున్న బిఎస్‌ఎఫ్ బృందం ఈ చొరబాటును గుర్తించి వెంటనే ఈ చర్యలు చేపట్టింది. భారత్-పాకిస్థాన్ సముద్ర సరిహద్దు ప్రాంతమైన సర్ క్రీక్ అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో భద్రతా బలగాలు నిరంతరం నిఘా ఉంచుతున్నాయి. బురదమయమైన భౌగోళిక పరిస్థితులు, టైడల్ క్రీక్‌లు ఉన్నప్పటికీ బలగాలు అప్రమత్తంగా ఉంటూ సరిహద్దు భద్రతను పటిష్టం చేస్తున్నాయి.
అరెస్ట్ చేసిన జాలర్ల వివరాలు, పడవ స్వాధీనానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమ చొరబాటులను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కొనసాగుతున్నాయని బిఎస్‌ఎఫ్ స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi