పోక్సో చట్టంపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి.. జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్
విద్యార్థులు బాలల హక్కులు, పోక్సో చట్టంపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని నిర్మల్ జిల్లా కోర్ట్ సీనియర్ సివిల్ జడ్జి పి. రవీందర్ సూచించారు.
Judge


నిర్మల్, 28 అక్టోబర్ (హి.స.)

విద్యార్థులు బాలల హక్కులు, పోక్సో చట్టంపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని నిర్మల్ జిల్లా కోర్ట్ సీనియర్ సివిల్ జడ్జి పి. రవీందర్ సూచించారు.

నిర్మల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం కడెం మండలం లింగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జడ్జి రవీందర్ మాట్లాడుతూ 18 ఏళ్లలోపు బాలబాలికలకు రక్షణ కల్పించేందుకు పోక్సో చట్టం అమల్లో ఉందని వివరించారు. విద్యార్థులు ఎవరైనా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటే భయపడకుండా తల్లిదండ్రులకు విషయం చెప్పాలని, అవసరమైతే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. సోషల్ మీడియాలో ఫొటోలు, లింకుల ద్వారా బెదిరింపులకు పాల్పడే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలకు స్పందించకూడదని హెచ్చరించారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించడంతో పాటు తమకు ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకోవాలని జడ్జి సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande