ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు.
అర్హులైన పేద కుటుంబాలకు విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర వెల్లడించారు
Collector


ఖమ్మం, 29 అక్టోబర్ (హి.స.)

అర్హులైన పేద కుటుంబాలకు విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర వెల్లడించారు. ఇప్పటికే మొదటి, రెండో విడతల్లో ఇళ్లు మంజూరు కాగా, తదుపరి విడతల్లోనూ అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తామని వారు చెప్పారు.

ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో తక్కువ నీటితో సాగయ్యే కూరగాయలు, చిరుధాన్యాలు తదితర పంటలను ఎంచుకోవాలని సూచించారు. సదస్సులో రైతులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానాలిచ్చారు. వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల శాఖల అధికారులకు ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో తక్కువ నీటితో సాగయ్యే కూరగాయలు, చిరుధాన్యాలు తదితర పంటలను ఎంచుకోవాలని సూచించారు. వ్యవసాయ అధికారుల సలహాలతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలన్నారు. పశువుల దాణా కొరత నివారణకు ఉచితంగా పశుగ్రాస విత్తనాల కిట్లు అందిస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande