అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు
Collector


పెద్దపల్లి, 29 అక్టోబర్ (హి.స.) పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను, భూ భారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను పరిశీలించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పునఃసర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ పునఃసర్వే మొదటి విడతలో భాగంగా ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే పనులను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సర్వే పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, గడువు దాటిన దరఖాస్తులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు తమ భూ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande