
భువనేశ్వర్:, 31 అక్టోబర్ (హి.స.)
ప్రమాదవశాత్తు సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమవ్వగా, మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఘటనా స్థలంలో తీవ్ర విషాదం నెలకొంది.
స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన ఇద్దరు కార్మికులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi