మహానీయుడు శ్యామ్జీ కృష్ణ వర్మ త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదు: ప్రధాని మోదీ నివాళి!
మహానీయుడు శ్యామ్జీ కృష్ణ వర్మ త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదు: ప్రధాని మోదీ నివాళి!
PM Narendra Modi


న్యూఢిల్లీ, 04 అక్టోబర్ (హి.స.)

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అసాధారణ పోరాట పటిమను కనబరిచిన గొప్ప విప్లవ వీరుడు, దేశభక్తుడు శ్యామ్‌జీ కృష్ణ వర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. మాతృభూమి విముక్తి కోసం ఆయన చేసిన త్యాగాలను, అందించిన అమూల్యమైన సేవలను ఈ సందర్భంగా ప్రధాని స్మరించుకున్నారు.

ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. గ్రేట్ రెవల్యూషనరీ శ్యామ్‌జీ కృష్ణ వర్మ చూపిన సాహసాన్ని, దేశం కోసం ఆయన అర్పించిన ప్రాణత్యాగాన్ని ఈ దేశం ఎప్పటికీ మరువలేదు అని కొనియాడారు. విదేశాలలో భారత స్వాతంత్య్ర ఉద్యలానికి బలమైన పునాది వేయడంలో, యువతలో దేశభక్తిని రగిలించడంలో ఆయన అగ్రగామిగా నిలిచారని ప్రధాని ప్రశంసించారు. ఆయన ఆశయాలు భవిష్యత్ తరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, ఈ దేశ స్వేచ్ఛా వాయువుల వెనుక ఎంతోమంది మహానుభావుల చెమట, త్యాగం ఉన్నాయని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande