పాక్ గూఢచర్య వ్యవహారంపై ఏపీలో భారీ ఆపరేషన్.. 18 మంది అనుమానితులపై నిఘా (UPDATE)
ఆంధ్రప్రదేశ్లో పాకిస్థాన్కు అనుసంధానమైనట్లు అనుమానిస్తున్న గూఢచర్య వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర భద్రతా వ్యవస్థలో కలకలం రేపుతోంది. ఈ కేసులో మొత్తం 18 మందిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తాజా సమాచారం వెల్లడించింది.
Ap police


అమరావతి , 06 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో పాకిస్థాన్కు అనుసంధానమైనట్లు అనుమానిస్తున్న గూఢచర్య వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర భద్రతా వ్యవస్థలో కలకలం రేపుతోంది. ఈ కేసులో మొత్తం 18 మందిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తాజా సమాచారం వెల్లడించింది. వీరిలో 13 మంది నౌకాదళ సిబ్బంది ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలోని నేవీ స్థావరాలు, నౌకాదళ కార్యకలాపాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని విదేశీ గూఢచార సంస్థలకు చేరవేసే ప్రయత్నాలు జరిగాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ వ్యవహారానికి ‘ఆపరేషన్ ఫైర్వాల్–2026’ అనే పేరు పెట్టారు.

ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఆధ్వర్యంలో 12 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సోదాలు, విచారణలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. అనుమానితులు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ మార్గాలను ఉపయోగించారా, సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో సంబంధాలు ఏర్పరుచుకున్నారా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్కు సంబంధించిన సమాచారమే ఈ దర్యాప్తులో ప్రధానంగా మారింది. ప్రదీప్ ముఖర్జీ అనే 31 ఏళ్ల నావికుడు సోషల్ మీడియా ఆధారిత ‘హనీ ట్రాప్’ ద్వారా సున్నితమైన నౌకాదళ సమాచారాన్ని పాకిస్థాన్కు చెందిన ఇంటెలిజెన్స్ ఆపరేటివ్కు అందించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన గతంలో విశాఖలోని ఈస్ట్రన్ నేవల్ కమాండ్లో విధులు నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande