కృష్ణా బోర్డు ఛైర్మన్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. పల్నాడు వాటర్ గ్రిడ్పై ఫిర్యాదు
కృష్ణా నదీ జలాల వినియోగం, తెలంగాణ తాగునీటి ప్రయోజనాల పరిరక్షణ అంశాలపై బీఆర్ఎస్ నేతలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ను కలిశారు.
Krishna river


హైదరాబాద్ , 23 నవంబర్ (హి.స.)కృష్ణా నదీ జలాల వినియోగం, తెలంగాణ తాగునీటి ప్రయోజనాల పరిరక్షణ అంశాలపై బీఆర్ఎస్ నేతలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ను కలిశారు. ఈ సందర్భంగా పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలను బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టు కారణంగా తెలంగాణకు సంబంధించిన నీటి ప్రయోజనాలపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

తెలంగాణలోని పలు జిల్లాల ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణా జలాశయాల్లో తగినంత నీటి నిల్వలు కొనసాగించాలని బీఆర్ఎస్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణకు కేటాయించిన నీటి ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని కోరినట్లు సమాచారం.

మరోవైపు బోర్డు కార్యాలయంలో తమకు ఎదురైన పరిస్థితిపై మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్రెడ్డి, లింగయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమను లోపలికి అనుమతించకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం తెలిపారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజాప్రతినిధుల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు తమ పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande