చేవెళ్లలో మహిళ హత్య కేసు: 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
చేవెళ్లలో మహిళ హత్య కేసు: 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
చేవెళ్లలో మహిళ హత్య కేసు: 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు


హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.)

చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బత్తుల పద్మ అనే మహిళ హత్య కేసును తెలంగాణ పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా వెలుగోడు మండలం జమ్మినగర్‌కు చెందిన 19 ఏళ్ల కేతావత్ శివశంకర్ వరప్రసాద్ నాయక్ అలియాస్ శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నవంబర్ 20న బత్తుల గురువులు అనే వ్యక్తి సెల్‌ఫోన్‌ను శివ దొంగిలించగా, ఆ ఫోన్ ద్వారా ఆయన బ్యాంకు ఖాతా నుండి రూ. 45,000 వేరే ఖాతాకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ చోరీపై అనుమానంతో నవంబర్ 21న బాధితుడు గురువులు, పద్మతో కలిసి చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో శివపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసే సమయంలో పద్మ కూడా వెంటే ఉండటంతో ఆమెపై కక్ష పెంచుకున్న శివ, ఫరా కాలేజీ ఎదురుగా ఉన్న రేకుల ఇంటి సమీపంలో ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు.

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని పట్టుకున్నారు. అతడి వద్ద నుండి చోరీకి గురైన సెల్‌ఫోన్‌తో పాటు హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande