కరీంనగర్లో నేడు బీజేపీ ‘మహా పాదయాత్ర’: ఏర్పాట్లు పూర్తి..
కరీంనగర్లో నేడు బీజేపీ ‘మహా పాదయాత్ర’: ఏర్పాట్లు పూర్తి..
Nithin Nabin


కరీంనగర్:, 23 నవంబర్ (హి.స.)

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేడు (సోమవారం, నవంబర్ 23) కరీంనగర్ జిల్లా కేంద్రంలో ‘మహా పాదయాత్ర’ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా బీజేపీ చేపడుతున్న ‘లోక్‌తంత్ర బచావో, అరాజక్తా హటావో’ (ప్రజాస్వామ్యాన్ని రక్షించండి – అరాచకత్వాన్ని తొలగించండి) ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ భారీ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు.

ఒకరోజు పర్యటన నిమిత్తం కరీంనగర్ విచ్చేస్తున్న నితిన్ నబీన్, మధ్యాహ్నం 1:45 గంటలకు వైశ్య భవన్ సమీపంలో పాదయాత్ర ప్రారంభానికి ముందు ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కరీంనగర్‌లోని గాంధీ విగ్రహం నుంచి వైశ్య భవన్, టవర్ సర్కిల్, భారత్ టాకీస్ మీదుగా కమాన్ చౌరస్తా వరకు సుమారు రెండున్నర కిలోమీటర్లకు పైగా ఈ మహా పాదయాత్ర కొనసాగేలా బీజేపీ నాయకత్వం రూట్ మ్యాప్ రూపొందించింది.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించి, ఈ మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మరియు ప్రతిపక్షాల అరాచక ధోరణులను ప్రజల ముందు ఎండగట్టడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ ఈ దేశవ్యాప్త అభియాన్‌ను నిర్వహిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande