తెలంగాణ లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయి: కేటీఆర్
డీలిమిటేషన్ బిల్లుపై బీఆర్ఎస్ వైఖరిని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
KTR


హైదరాబాద్ , 28 నవంబర్ (హి.స.)

డీలిమిటేషన్ బిల్లుపై బీఆర్ఎస్ వైఖరిని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో ఎలాంటి తగ్గుదల ఉండకూడదని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.

దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న 24 శాతం ప్రాతినిధ్య వాటాను కొనసాగించాలని కేటీఆర్ కోరారు. 2051 వరకు రాష్ట్రాల మధ్య లోక్సభ స్థానాల ప్రాతినిధ్య నిష్పత్తిలో మార్పులు రాకుండా రక్షణ కల్పించాలని అభిప్రాయపడ్డారు. మొత్తం ఎంపీ స్థానాలను 50 శాతం పెంచాలనే ప్రతిపాదన తమ ఆందోళనలకు పరిష్కారం చూపుతుందని పేర్కొన్నారు.

ఈ ప్రతిపాదన అమలైతే తెలంగాణలో లోక్సభ స్థానాలు ప్రస్తుతం ఉన్న 17 నుంచి 26కు పెరిగే అవకాశం ఉందని కేటీఆర్ వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.

మహిళా రిజర్వేషన్ల అమలుకు తమ పార్టీ ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని, మహిళలకు రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేటీఆర్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande