
హైద్రాబాద్ , 28 నవంబర్ (హి.స.)
హైద్రాబాద్ బోరబండ లోని సాయిబాబా ఆలయంలో SC హక్కుల పోరాట సంఘం, సామాజిక సమరసత వేదికగా ఏర్పాటు చేసిన సమతా సంగమం కార్యక్రమానికి జనాలు వందల సంఖ్యలో పాల్గొన్నారు. కుల సంఘాలుగా విడిపోయి వనభోజనాలు చేస్తున్న హిందూ ధర్మంలో అన్ని కులాలను ఒక్క చోట చేర్చి కలిసి భోజనం చేసే సమత సంగమం కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. దళితులకు ఇళ్లు ఇవ్వడానికి , ఆలయ ప్రవేశానికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయని ఇలాంటి అసమానతలు హిందూ ధర్మంలో నుండి పోతేనే హిందువులు సంఘటితం అవుతారని అప్పల ప్రసాద్ గారు అన్నారు, దళిత యాక్టివిస్ట్ న్యాయవాది మారేడు మోహన్ మాట్లాడుతూ కుల వైవిధ్యం ఉంటే తప్పు లేదు కానీ కుల వైరుధ్యం ఉండకూడదని, కులాలకు అతీతంగా హిందువులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అందుకే ప్రతి ఏట దీపావళి తరువాత దళిత బస్తీల్లో సమత సంగమం ఏర్పాటు చేసి అందరూ ఒకేదగ్గర కూర్చుని సహాపంక్తి భోజనం చేయడంతో సమాజంలో ఉన్న అస్పృశ్యతను దూరం చేయవచ్చని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్