తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన చికెన్, కోడిగుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన చికెన్, కోడిగుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన చికెన్, కోడిగుడ్ల ధరలు


హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ నగరాల్లో వీటి రేట్లు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం కార్తిక మాసంతో పాటు అయ్యప్ప, శివమాల దీక్షల కాలం నడుస్తుండటంతో చాలామంది నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా మార్కెట్లో డిమాండ్ పడిపోయింది. మరోవైపు పౌల్ట్రీ ఫారాల నుండి సరఫరా యథావిధిగా సాగుతుండటంతో ధరలు వేగంగా తగ్గుముఖం పట్టాయి.

ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.300 దాటి కొనుగోలుదారులకు భారంగా మారింది. కానీ డిమాండ్ క్షీణించడంతో కిలో చికెన్‌పై దాదాపు రూ.50 వరకు తగ్గింది. కోడిగుడ్ల ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి.

**హైదరాబాద్ మార్కెట్ ధరలు:**

* స్కిన్‌లెస్ చికెన్ (కిలో): రూ.252

* డ్రెస్డ్ చికెన్ (కిలో): రూ.223

* రిటైల్ లైవ్ బర్డ్ (కిలో): రూ.144

* ఎక్స్-ఫామ్ లైవ్ బర్డ్ (కిలో): రూ.117

* కోడిగుడ్లు (డజన్): రూ.74 (గతంలో సుమారు రూ.90 వరకు ఉండేవి)

**విజయవాడ మార్కెట్ ధరలు:**

* స్కిన్‌లెస్ చికెన్ (కిలో): రూ.249

* డ్రెస్డ్ చికెన్ (కిలో): రూ.220

* రిటైల్ లైవ్ బర్డ్ (కిలో): రూ.142

* ఫామ్ లైవ్ బర్డ్ (కిలో): రూ.115

* కోడిగుడ్లు (డజన్): రూ.80

డిసెంబర్‌లో మళ్లీ పెరిగే అవకాశం:

కార్తిక మాసం ముగిసేవరకు ధరలు ఇలాగే తక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. వచ్చే నెలలో కార్తిక మాసం పూర్తి కావడం, క్రిస్మస్ పండుగ సీజన్ మొదలవడంతో మాంసాహారానికి మళ్లీ గిరాకీ పెరిగి ధరలు పుంజుకుంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande