
హైదరాబాద్, 06 నవంబర్ (హి.స.)
ఉత్తరాఖండ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సరికొత్త వేగం అందించాయి. రాష్ట్ర ప్రగతిని పరుగులు తీర్పించే లక్ష్యంతో రూ. 1,475 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 62 ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కలిసి ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేశారు. డెహ్రాడూన్లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఈ ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేశారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, పర్యాటకం, విద్యా రంగాలకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనలో ఈ పథకాలు కీలక పాత్ర పోషించనున్నాయి.
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ... దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలో రాష్ట్రం వేగవంతమైన పురోగతి సాధిస్తోందని ప్రశంసించారు. సీఎం ధామీ మాట్లాడుతూ, రూ. 1,475 కోట్ల విలువైన ఈ 62 అభివృద్ధి పథకాలు రాష్ట్రంలోని కొండ ప్రాంతాలు, గిరిజన గ్రామాలు మరియు పట్టణ ప్రాంతాల రూపురేఖలను మార్చివేస్తాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు పర్యాటకరంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi